Mangalagiri Aiims Advanced Blood Screening System Started: మంగళగిరి ఎయిమ్స్‌లో అధునాతన బ్లడ్ టెస్టింగ్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఎయిమ్స్‌లో ఆటోమేటెడ్ ట్రాన్స్ ఫ్యూజన్, ట్రాన్స్‌మిసిబుల్ ఇన్ఫెక్షన్స్ స్క్రీనింగ్ సిస్టమ్‌ను సీఈవో ప్రొఫెసర్ డాక్టర్ అహంతమ్ శాంతాసింగ్ ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటగా మంగళగిరి ఎయిమ్స్‌లో ఈ పరికరాలు ప్రారంభించారు. మొత్తం రూ.1.73 కోట్లతో దీనిని ఏర్పాటు చేశారు. ఇకపై ఎయిమ్స్‌లో రక్త పరీక్షలు మరింత వేగంగా నిర్వహించనున్నారు.