Nara Lokesh Review On 100 Bed Hospital: మంత్రి నారా లోకేష్ మంగళగిరి ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు.. 30 ఏళ్ల కలను నిజం చేయబోతున్నారు. మంగళగిరి సమీపంలోని చినకాకాని దగ్గర వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి కీలక సమీక్షను నిర్వహించారు. ఈ ఆస్పత్రి దేశానికి రోల్ మోడల్ కావాలని అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు ఆస్పత్రి డిజైన్లపై ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్ష చేశారు. ఆస్పత్రిలో పార్కింగ్, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ రూపొందించాలి అన్నారు.