మంచువారి ఫ్యామిలీ ఫైట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటివరకు వాళ్ల ఫ్యామిలీ ఫైట్ విషయంలో ఎవరు జోక్యం చేసుకోకపోగా.. డిసెంబర్ 10వ తేదీన ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు చేసిన దాడితో ఒక్కసారిగా అందరూ రియాక్ట్ అవుతున్నారు. రాజకీయ నాయకులు కూడా ఈ విషయంపై స్పందిస్తూ తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందిస్తూ.. మోహన్ బాబుకు ఓ సలహా కూడా ఇచ్చారు.