మార్చి 31తేదీలోపు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను స్వీకరిస్తారు. ఈ తేదీలోపు అప్లికేషన్లు చేసుకున్నవారికి 25 శాతం రాయితీ ఉంటుంది. దరాఖాస్తుల గడువు మరోసారి పెంచే ఆలోచన లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇక త్వరలోనే.. భూ వ్యాల్యూను పెంచనున్నట్లు మంత్రి తెలిపారు. అంతే కాకుండా.. త్వరలో భూ సర్వే కోసం ప్రతీ మండలంలో సర్వేయర్లను నియమిస్తామన్నారు. సాదామైనామాల దరఖాస్తులను స్వీకరించబోమన్నారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే..