కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ మంత్రులు అవినీతిలో కూరుకుపోయారని వ్యాఖ్యానించారు. వారి అవినీతికి ఐఏఎస్ అధికారులు మధ్యవర్తిత్వం వహిస్తున్నారని చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ అవినీతి లెక్కలు మొత్తం సేకరిస్తున్నామని చెప్పిన బండి సంజయ్.. త్వరలోనే వాటిని బయటపెడతానని పేర్కొన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని ఆరోపించారు.