తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త వినిపించింది రేవంత్ రెడ్డి ప్రభత్వం. ఇప్పటికే ఉన్న మద్యం బ్రాండ్లతో పాటు మరిన్ని కొత్త బ్రాండ్లను ఆహ్వానించేందుకు తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు.. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అవసరమైన చర్యలు కూడా చేపట్టింది. తెలంగాణలో ఇప్పటివరకు లేని విదేశీ బ్రాండ్లతో పాటు దేశీయ బ్రాండ్లు కూడా కొత్త బ్రాండ్ల అమ్మకాలు జరుపుకునేందుకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు.. సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం.