బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, మద్యపానం నిషిద్ధం.. అతిక్రమిస్తే చట్టప్రకారం శిక్షార్హులు. ఇలాంటి బోర్డులు మనకు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రవర్తిస్తుంటారు కొంతమంది. బహిరంగ ప్రదేశాల్లోనే మద్యం తాగడం.. అంతటితో ఊరుకోకుండా మద్యం తాగి వాహనాలను నడపడం చేస్తుంటారు. ఇలాంటివారిలో మార్పు తెచ్చేందుకు నంద్యాల జిల్లా బనగానపల్లె కోర్టు సరికొత్త శిక్ష విధించింది. బనగానపల్లె జూనియర్ సివిల్ జడ్జి కోర్టు విధించిన ఈ శిక్షను స్థానికులు అభినందిస్తున్నారు.