తెలంగాణలో ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టంట్ కేఫ్‌లో మైక్రో బ్రూవరీ నుంచి అప్పటికప్పుడు తయారై బీరు నేరుగా మందుబాబుల గ్లాసులోకి వస్తుంది. హైదరాబాద్ నగరంలో ప్రతి 3 కి.మీ ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇక జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ప్రతి 30 కి.మీ ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.