తెలంగాణలోని మద్యం ప్రియులకు త్వరలోనే షాక్ తగిలే అవకాశం ఉంది. రాష్ట్రంలో లిక్కర్ ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. పక్క రాష్ట్రాల్లో ఉన్న ధరలకు అనుగుణంగా మార్పులకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బీరుపై రూ. 15-రూ. 20, క్వార్టర్ బ్రాండ్‌ను బట్టి రూ. 10-రూ. 80 వరకు పెంచే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. ఈ పెంపు ద్వారా ప్రతి నెలా రూ.500-రూ.700 కోట్ల అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.