బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్ బార్‌లపై పోలీసులు ఆంక్షలు విధించారు. సైబరాబాద్‌లో కూకట్‌పల్లి, అల్లాపూర్, రాయదుర్గం, జీడిమెట్ల, మేడ్చల్, చందానగర్‌లో ఆగస్టు 9 ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు షాపులు మూసివేయాలి. హైదరాబాద్‌లో ప్రాంతాన్ని బట్టి ఒకటి లేదా రెండు రోజులు ఆంక్షలు ఉంటాయి. ఫ్యూచర్ సిటీలో ఆగస్టు 9 ఉదయం 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు మూసివేత ఉంటుంది.