మడకశిర: అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ

2 months ago 5
Sheep walking around fire pit: అగ్నిగుండం చుట్టూ గొర్రెలను ప్రదక్షిణ చేయించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుర్రపుకొండ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇలా చేస్తే మంచి జరుగుతుందని స్థానికుల నమ్మకం. కర్రలు పేర్చి భారీ మంట పెట్టి, అనంతరం ఆ నిప్పుల చుట్టూ గొర్రెలను ప్రదక్షిణ చేయించారు గొర్రెలకాపర్లు. చుట్టూ ఉన్నవారు సంప్రదాయ వాయిద్యాలను వాయిస్తూ, ఈలలు వేస్తూ ఉత్సాహపరిచారు. అగ్నిగుండం చుట్టూ గొర్రెల మంద ప్రదక్షిణ చేస్తున్న దృశ్యాలను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Read Entire Article