తెలంగాణలో వినాయక ఉత్సవాలు మరోసారి మత సామరస్యాన్ని చాటి చెప్పాయి. పలు చోట్ల ముస్లింలు ఉత్సవాల్లో పాల్గొనటమే కాదు.. వినాయకుడి లడ్డూను సైతం సొంతం చేసుకున్నారు. పోటాపోటీగా జరిగిన వేలాల్లో అత్యధిక ధర పెట్టి లంబోదరుడి లడ్డూ ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు. హిందూ ముస్లింలు అన్నదమ్ముల వలె కలిసే ఉంటారని బలంగా చాటి చెప్పారు.