తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించింది. డిసెంబర్ 1, 2025 నుంచి నవంబర్ 10, 2027 వరకు లైసెన్స్ కాలం ఉంటుందని.. ఈ సారి దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. మద్యం దుకాణాల కేటాయింపుల్లో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం దుకాణాలను కేటాయించనున్నారు. దరఖాస్తుదారుడు ఒక్క దరఖాస్తు కంటే ఎక్కువ దరఖాస్తులు చేసుకునేందుకు కూడా అవకాశం ఉంది.