అనారోగ్య కారణాలతో కన్నుమూసిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. మరోవైపు మన్మోహన్ సింగ్ తమ కుటుంబానికి చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు, మన్మోహన్ సింగ్ మధ్య జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకుంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. తమ కుటుంబం మొత్తం మన్మోహన్ సింగ్‌కు రుణపడి ఉంటుందని..ఆయనను మిస్ అవుతున్నామంటూ లోకేష్ ట్వీట్ చేశారు.