మన్మోహన్ సింగ్ గొప్పతనం, సామర్థ్యం, జ్ఞానాన్ని ముందుగా గుర్తించిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలనే ప్రతిపాదనతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నామన్నారు. ఎన్నో అడ్డంకులు, ఎన్నో అభ్యంతరాలున్నా మన్మోహన్ సింగ్ ప్రజా ఉద్యమాలకు అండగా నిలబడ్డారన్నారు. అందుకే ఆయన్ను సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడ్రన్ ఇండియాగా పిలుస్తారని చెప్పారు.