Lokesh On Cpm Leaders Arrest: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనపై మంత్రి లోకేష్ స్పందించారు.. కామ్రేడ్ మన్నించండి అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆ ట్వీట్‌ను ఏపీ పోలీస్ 100కు మంత్రి నారా లోకేష్ ట్యాగ్ చేశారు. గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు తమ కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమన్నారు లోకేష్.