ప్రధాని నరేంద్ర మోదీ వాయుసేన విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.55 గంటలకు కర్నూలు చేరుకుంటారు. అక్కడినుంచి సైనిక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్తారు. అనంతరం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత శివాజీ స్ఫూర్తికేంద్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైలం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.20కి కర్నూలు చేరుకుంటారు. అక్కడ జీఎస్టీ సభలో ప్రసంగించిన తర్వాత కర్నూలు విమానాశ్రయం చేరుకుని సాయంత్రం 4.45కు దిల్లీ బయల్దేరి వెళ్తారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన, నిర్మించబోతున్న రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.