అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆత్మార్పణ దినం కార్యక్రమం నిర్వహించింది. పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆత్మార్పణ దినం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మనిషి మర్చిపోవటం సహజమే కానీ.. అండగా నిలబడిన వారిని మర్చిపోకూడదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.