తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మరో బాంబు పేల్చారు. అది కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీదే. ఇప్పటికే కేటీఆర్ మీద.. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసి విచారణ జరుపుతుండగా.. ఇప్పుడు మరో బాంబు పేల్చారు. త్వరలోనే కేటీఆర్ దుబాయ్ ఫైల్స్ బయటకు తీసుకొస్తానని.. సభలోనే ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే దుబాయ్ నుంచి మొత్తం రికార్డులు తెప్పించినట్టు కూడా చెప్పుకొచ్చారు.