టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. అతని కుమారులు మంచు విష్ణు, మనోజ్ లు ఇటీవల కుటుంబ అంతర్గత కలహాలతో రోడ్డున పడిన వ్యవహరం మరువకముందే మంచు విష్ణు సిబ్బంది వన్యప్రాణుల వేట కేసులో చిక్కుకున్నారు. విష్ణు సిబ్బంది అడవి పందులను వేటాడినట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.