హైదరాబాద్‌లో జరిగిన 'భారత్ సమ్మిట్ 2025'లో తప్పుగా ఉన్న భారత పటం వివాదానికి దారితీసింది. జమ్మూ కాశ్మీర్‌ను సరిగా చూపించలేదని బీజేపీ తెలంగాణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోస్ట్ చేసిన ఫోటోతో ఇది వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ దేశద్రోహానికి పాల్పడిందని బీజేపీ విమర్శిస్తోంది. ఇది దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే చర్య అని మండిపడుతోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతోంది.