సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గడం లేదు. నేటి నుంచి బంద్‌కు పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఏసీ నేతలు.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులను డిపోలకే పరిమితం చేశారు. ఈ నేపథ్యంలోనే తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఈ నిరసనలు ఆపేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. చర్చలు నిర్వహించి.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ ఆర్టీసీ సమ్మెను మరో సకల జనుల సమ్మెగా మార్చుతామని హెచ్చరించారు.