కుమురం భీం అసిఫాబాద్ జిల్లా ప్రజలను పెద్దపులి గజగజా వణికిస్తోంది. శుక్రవారం ఉదయం ఓ యువతిపై పులి దాడి చేసి చంపింది. ఆ ఘటన మరువక ముందే తాజాగా మరో రైతుపై పెద్దపులి దాడి చేసింది. సిర్పూర్ టి మండలంలోని దుబ్బగూడలో పొలంలో పనిచేస్తున్న సురేశ్ అనే రైతుపై పులి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.