హైదరాబాద్‌లోని మలక్ పేట మెట్రో స్టేషన్ కింద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం (డిసెంబర్ 06న) మధ్యాహ్నం సమయంలో మెట్రో స్టేషన్ మెట్ల కింద పార్కు చేసిన ద్విచక్రవాహనాల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 5 వాహనాలు పూర్తిగా తగలబడి పోయాయి. అయితే.. ఈ ప్రమాదానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.