AP High Court On Special Category Status Petition: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ మేరకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిల్‌పై తాజాగా విచారణ జరగ్గా.. కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిల్‌లో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర హోం, ఆర్థిక శాఖ కార్యదర్శులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీతి ఆయోగ్ చైర్మన్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.