హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రా మళ్లీ కూల్చివేతలు చేపట్టింది. గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న బుల్డోజర్లను మళ్లీ స్టార్ట్ చేశారు. తాజాగా గచ్చిబౌలిలోని ఖాజాగూడ భగీరథమ్మ చెరువులో కూల్చివేతలు చేపట్టారు. అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు.