లగచర్ల ఘటను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఈనెల 25న మహబూబూబాద్‌లో మహాధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ధర్నాలో పాల్గొనగా.. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు కేటీఆర్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. 'గో బ్యాక్ కేటీఆర్' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసినట్లు ఓ వీడియో వైరల్ చేస్తున్నారు. అయితే అందులో అసలు వాస్తవమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.