ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయాన్ని టీటీడీ ఏర్పాటు చేయనుంది. కుంభమేళాలో టీటీడీ నమూనా ఆలయం ఏర్పాటు కోసం రెండున్నర ఎకరాలు కేటాయించారు. ఈ స్థలాన్ని టీటీడీ జేఈవో శనివారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఉత్తరాది భక్తులను దృష్టిలో ఉంచుకుని నమూనా ఆలయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు వచ్చే ఏడాది జనవరిలో ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా మొదలు కానుంది. ఫిబ్రవరి 26 వరకూ కొనసాగనుంది.