తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం మహానాడు తొలిరోజు ముగిసింది. ఈ సందర్భంగా పార్టీకి నేతలు అందించిన వివరాలను వెల్లడించారు. మొత్తంగా తొలిరోజు రూ.12 కోట్లు విరాళాలు టీడీపీకి లభించాయి. ఎంపీ వేమిరెడ్డి దంపతులు రూ.5 కోట్లు విరాళాలు అందించగా.. సానా సతీష్, భాష్యం రామకృష్ణ, బీసీ జనార్ధన్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా భారీ విరాళాలు అందించారు. ఇక మహానాడు చరిత్రలోనే తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్ ప్రసంగించటం హైలైట్‌గా నిలిచింది.