ఏపీలో కృష్ణ , గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వినియోగించుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన చంద్రబాబుతో మాట్లాడేందుకు స్థానికులు వచ్చారు. అందరితో సరదాగా, ఆప్యాయంగా వారితో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలు, మహిళలు కోరిక మేరకు వారితో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి చంద్రబాబుకు నమస్కారం చేసింది. ప్రతిగా సీఎం కూడా నమస్కారం చేశారు.