తెలంగాణలో పంచాయతీ రాజ్ శాఖలో పనిచేసే ఓ చీఫ్ ఇంజనీర్, మహిళా ఉద్యోగులను వీడియో కాల్స్ ద్వారా వేధిస్తున్నాడు. వీడియో కాల్ మాట్లాడమని ఒత్తిడి చేస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. విసిగిపోయిన ఉద్యోగులు మంత్రి సీతక్కకు ఫిర్యాదు చేశారు. సీతక్క వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారం తెలంగాణ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇంజనీర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఆ వివరాలు..