కోవూరు నియోజకవర్గం పరిధిలోని ఆర్.భీమవరంలో ఎంఎస్ఎంఈ పార్క్‌కు సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అయితే ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు కాబోయే ప్రదేశానికి స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదివారం వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె బీఎండబ్ల్యూ ఈవీ కారులో అక్కడి వెళ్లారు. దీన్ని అడ్మిన్ ఆమె సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. అయితే ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ కారు కావడంతో నెటిజన్లు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు.