సోషల్ మీడియాలో ఓ మహిళా నేతను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ కె. అనిల్‌పై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ చర్యలు తీసుకున్నారు. 2018 బ్యాచ్‌కు చెందిన అనిల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న అతను సోషల్ మీడియా వేదికగా.. అభ్యంతరకర కామెంట్ పెట్టగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన సీపీ అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.