మహిళా సంఘాలకు మరో 400 కొత్త బస్సులు.. ఏటా రూ.244.08 కోట్ల ఆదాయం

3 months ago 14
మహిళా సంఘాల ఆర్థిక సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం రెండో విడతకు సిద్ధమైంది. ఇందులో భాగంగా మహిళా సంఘాలు కొనుగోలు చేసిన మరో 400 కొత్త బస్సులను మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు. తొలి విడతలోని 153 బస్సులతో కలిపి మొత్తం బస్సుల సంఖ్య 553కు చేరింది. ఆర్టీసీ వీటిని అద్దెకు తీసుకుని నడపడం ద్వారా మహిళా సంఘాలకు ఏటా రూ.244.08 కోట్ల ఆదాయం సమకూరనుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని అత్యధిక మండలాలకు రవాణా సౌకర్యం విస్తరించనుంది.
Read Entire Article