ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లారు. మార్కాపురంలో జరిగిన మహిళా దినోత్సవం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే దీపం పథకం తేవడానికి గల కారణాలను సీఎం చంద్రబాబు వివరించారు. చిన్నప్పుడు తన తల్లి వంట గదిలో పడుతున్న కష్టాలు, పొగతో ఆమె కళ్లల్లో వచ్చిన కన్నీళ్లు చూసే ఈ పథకం తెచ్చినట్లు చంద్రబాబు వివరించారు.