కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం మల్లాపూర్ గ్రామంలోని ప్రజలు కల్లు కోసం ఆందోళన చేస్తున్నారు. కల్లు లేక గ్రామంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ ఆందోళనకు దిగారు. బీర్కూర్, నరసురా బాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో కల్తీకల్లు బారిన పడి గతంలో పలువురు హాస్పిటల్ పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే.. కల్తీ కల్లును కట్టడి చేసే క్రమంలో.. కల్లు సరఫరా జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో.. 10 రోజుల నుంచి కల్లు దొరకకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కల్లు తాగకపోవడంతో నరాల నొప్పి, అన్నం పోవడం లేదు, స్పృహ తప్పి పడిపోతున్నామంటూ గ్రామస్థులు ఆవేదన వ్కక్తం చేస్తున్నారు. వింత వింతగా పరివర్తిస్తూ విచిత్ర చేష్టలు చేస్తుండటంతో బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో కల్లు దుకాణాలను పునరుద్ధరించాలంటూ బాధితుల కుటుంబ సభ్యుల డిమాండ్ చేస్తున్నారు.