'మా కుమార్తె చనిపోయింది.. వరకట్నం వెనక్కివ్వండి'.. భర్త ఇంటి ఎదుట మృతదేహంతో ధర్నా

7 months ago 11
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లో విషాదం చోటం చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతిచెందడంతో ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సమయంలో ఇచ్చిన 30 తులాల బంగారం, రూ. 50 లక్షల నగదు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. భర్తతో వివాదాల కారణంగా ఆమె మృతదేహాన్ని అత్తవారింటికి తీసుకొచ్చారు. పోలీసులు జోక్యం చేసుకుని, నచ్చజెప్పడంతో రెండు రోజులుగా అంబులెన్స్‌లో ఉన్న మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.
Read Entire Article