శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా ఖండించారు. నీటి మట్టం తగ్గినప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేయకూడదనే నిబంధన ఉన్నా.. ఏపీ ప్రభుత్వం దాన్ని ఉల్లంఘిస్తోందని. ఈ చర్య వల్ల తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఏపీ అలుసుగా తీసుకుందని.. తెలంగాణ రైతుల హక్కుల కోసం సమిష్టిగా పోరాడుతామని జూపల్లి స్పష్టం చేశారు.