Ys Jagan Comments On Chandrababu: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించారు. వరదల్లో ప్రభుత్వ వైఫల్యం కప్పి పుచ్చుకోవటానికి ఎప్పుడో టీడీపీ కార్యాలయంపైన జరిగిన దాడి కేసులో సంబంధం లేని మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. రెడ్ బుక్ పెట్టుకోవటం ఘనకార్యం కాదని.. ఇదే తరహా సంప్రదాయం కొనసాగితే ఇదే జైల్లో తరువాతి కాలంలో ఎవరు ఉంటారో గుర్తు పెట్టుకోవాలని జగన్ హెచ్చరించారు.