తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు బీసీ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమేనని అందుకు తమిళనాడు ఉదాహరణగా ఉందని గుర్తుచేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి రిజర్వేషన్లు సాధించి చూపాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. బీజేపీది బీసీ వ్యతిరేక వైఖరి అని, సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని మంత్రి స్పష్టం చేశారు.