మా హోర్డింగులు కాదు.. అలా చేస్తే నేనే సన్మానం చేస్తా: కేటీఆర్

2 months ago 5
హైదరాబాద్‌లో ‌కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఈనో (ENO) హోర్డింగులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన హోర్డింగ్‌ల‌ను చూసి ఏడ్వాలో.. న‌వ్వాలో అర్థం కావ‌డం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్వీ క్యాలెండ‌ర్ ఆవిష్కర‌ణ అనంత‌రం కేటీఆర్ ప్రసంగించారు. రేవంత్ రెడ్డి పెట్టుబ‌డులు తెస్తే అంద‌రికంటే ఎక్కువ‌గా సంతోష‌ప‌డతామన్నారు. రూ. 1.78 లక్షల కోట్లు అని చెప్తున్నారు కానీ.. 2024లో ఇలానే రూ. 42 వేల కోట్ల పెట్టుబ‌డులని చెప్పారు ఇప్పటివరకు ఏ కంపెనీ రాలేదని గుర్తుచేశారు. ప్రజ‌లు అనుమాన ప‌డుతున్నారని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి చేత‌నైతే పెట్టుబ‌డులు ఎప్పుడు వ‌స్తాయో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేసారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ చేసి చూపెడితే స‌న్మానం చేస్తానని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Entire Article