Mahatma Gandhi Death Anniversary: మాంసప్రియులకు అలెర్ట్. రేపు హైదరాబాద్‌లో కక్కాముక్కా దొరకదు. నగరవ్యాప్తంగా మాంసం విక్రయాలపై నిషేదం విధిస్తూ జీహెచ్ఎంసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మాంసం దుకాణాలు మూసేయాలని.. మండిలు కూడా తెరవొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఉత్తర్వులను కాదని ఎవరైనా మాంసం విక్రయాలు జరిపితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ హెచ్చరికలు కూడా జారీ చేశారు.