భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గిరిజన నాయకుడు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య (70) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అబ్బయ్య ఉమ్మడి ఏపీలో బూర్గంపాడు నుంచి ఓసారి, ఇల్లందు ఎమ్మెల్యేగా రెండుసార్లు పనిచేశారు. ఆయన మృతిపట్ల సీఎం రేవంత్ సహా.. పలువురు నేతలు సంతాపం తెలిపారు.