మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటి నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగింది. ఇద్దరు కార్మికులు చనిపోయారు. పనిచేస్తున్న సమయంలో కరెంట్ షాక్ తగలడంతో వారిద్దరూ అక్కడే పడిపోయారు. మిగిలినవారు, స్థానికులు కలిసి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు తెలిసింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని చెన్నకేశవ నగర్‌లో మాజీ మంత్రి ఇంటిని నిర్మిస్తున్నారు. ఈ ఇంటి నిర్మాణంలోనే ప్రమాదం జరిగింది. మరోవేపు కంభంలో జరిగిన మరో ఘటనలో కరెంట్ షాక్ కొట్టి ఓ మేస్త్రీ చనిపోయాడు.