Jogi Ramesh House Acb Raids: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. మొత్తం 15 మంది ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేపట్టారు. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఐడీ జప్తులో ఉన్న భూములను కొనుగోలు చేసి విక్రయించారనే ఆరోపణలతో ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి ఏసీబీ తనిఖీలు జరుగుతున్నాయి.