Nindra MPP Resign: మాజీ మంత్రి రోజాకు సొంత నియోజకవర్గం నగరిలో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె మద్దతుతో ఎంపీపీ అయిన దీప రాజీనామా చేశారు. రాజకీయ ఒత్తిడి, అవిశ్వాస తీర్మానం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రోజా వర్గం కారణంగా పదవి దక్కని భాస్కర్‌రెడ్డి, ఇప్పుడు టీడీపీలో చేరి మెజారిటీ సభ్యుల మద్దతుతో ఎంపీపీ పదవిని ఆశిస్తున్నారు. ఇది నిండ్ర రాజకీయాలు మళ్లీ చర్చకు దారితీశాయని చెప్పాలి.