మాజీ మంత్రి రోజాపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

1 year ago 22
మాజీ మంత్రి రోజాపై నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మండిపడ్డారు. రోజా ఓ పిచ్చిది.. పిచ్చిదానికి పిచ్చి కూతలు తప్ప మరొకటి రాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఏం మాట్లాడుతున్నామో తెలియక రోజా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారని.. ఆవుకు, గంగిరెద్దుకు తేడా తెలియని వ్యక్తి రోజా అన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి దావోస్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబుతో బృందం వెళ్లారని.. పెళ్లిళ్లలకు, పేరంటాలకు, ఓట్లకోసం దావోస్‌కు వెళ్లలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సమిష్టిగా కృషి చేస్తామని.. నగరిలో ఓ చిన్నారిపై వైఎస్సార్‌‌సీపీ నేత అఘాయిత్యానికి పాల్పడ్డారన్నారు. ఫోక్సో యాక్ట్ క్రింద కేసు నమోదు చేశారని.. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని.. అఘాయిత్యానికి పాల్పడిన వైఎస్సార్‌సీపీ నేతపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు భాను ప్రకాాష్.
Read Entire Article