Vidadala Rajini Appointed As Chilakaluripet In charge: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా విడదల రజనిని, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా బాలవజ్రబాబు (డైమండ్ బాబు) నియమితులయ్యారు. ఈ మేరకు త్వరలోనే వారు అక్కడ బాధ్యతలు స్వీకరించనున్నారు.