బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా రైతు భరోసా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయనకున్న 200 ఎకరాలు సాగు చేస్తే పెట్టుబడి సాయం అందిస్తామని మంత్రి కీలక ప్రకటన చేశారు. వరంగల్ అభివృద్ధిపై మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో కలిసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొంగులేటి.. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు.