బీఆర్ఎస్ హయాంలో హెల్త్ డైరెక్టర్‌గా సేవలందించిన డాక్టర్ గడల శ్రీనివాసరావు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ప్రెస్ మీట్లలో సినిమా డైలాగులు చెప్తూ.. సేవా కార్యక్రమాల్లో బహిరంగంగానే పొలిటికల్ కామెంట్లు చేస్తూ.. వార్తల్లో నిలిచిన గడల శ్రీనివాసరావు.. ఇప్పుడు వీఆర్ఎస్ ప్రకటించి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. అయితే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సైలెంట్ అయిపోయిన శ్రీనివాస్ రావు.. వీఆర్ఎస్ తీసుకోగా.. ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే.. నాలుగు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ కాగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.